సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం

కాకతీయ,అమరావతి: రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్...