ములుగులో బీఆర్ఎస్ ధర్నా.. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు: బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు: కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోస్ట్ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయని కాలేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు, మోడీలతో...