అమరవీరులకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు..!!
కాకతీయ, పరకాల : 1947లో రజాకార్ల కాల్పుల్లో అమరులైన త్యాగ వీరులను స్మరించుకుంటూ, మంగళవారం పరకాల అమరధామం,లో బిజెపి రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, ఊచకోతలో అమరులైన వీరుల త్యాగం తెలంగాణ విమోచన చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛను తీసుకొచ్చింది అమరుల త్యాగమేనని, వీరుల స్ఫూర్తి భవిష్యత్ తరాలకి మార్గదర్శకమని అన్నారు. అమరుల స్మారక స్థలాన్ని అభివృద్ధి చేసి, యువతకు చరిత్రను తెలియజేయడానికి మరింత...