క్రీడాకారులను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నారు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : బెంగుళూరులో జరిగిన నాలుగో సౌత్‌ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్, 2025లో విజేతలైన ఆటగాళ్లు, మాస్టర్స్‌కు గాంధీభవన్‌లో తెలంగాణ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన ఆటగాళ్లు 8 బంగారు, 6 వెండి, 8 కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టారని మహేష్ గౌడ్ అన్నారు. ఆటగాళ్ల కృషి, మాస్టర్స్‌ శ్రమకు ఆయన...