టాస్క్ సెంటర్‌లో ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు

కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టాస్క్ రీజనల్ సెంటర్ ఉచితంగా పలు టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టాస్క్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టాస్క్ రీజినల్ సెంటర్ ఇంచార్జీ టి.కౌసల్య మంగళవారం తెలిపారు. జావా వెబ్ డెవలప్‌మెంట్, పైథాన్, సీ, సీ++, హెచ్‌టిఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్,టాలీ విత్ జీఎస్‌టీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్‌ వంటి ముఖ్యమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు....