రైతుల ప్రయోజనాలే ముఖ్యం: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్రానికి 9వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా, మంగళవారం మరో 5వేల మెట్రిక్ టన్నులు చేరనున్నట్లు వెల్లడించారు. ఈ యూరియా సనత్‌నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే రేక్ పాయింట్లకు పంపిణీ అవుతుందని చెప్పారు. మరో వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా 27,470...