ఇందిరమ్మ ఇండ్ల పనులు పూర్తి చేయాలి : ములుగు జిల్లా కలెక్టర్ దివాకర

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ దివాకర వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి, ఇండ్ల బిల్లులు సకాలంలో పడుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల దశల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇండ్లు మంజూరు అవుతాయని, ఇప్పటికే ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని తెలిపారు....