నల్లబెల్లి మండలంలో బీఆర్ఏస్ లో భారీగా చేరికలు..!!

కాకతీయ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామ అనుములపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఏస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారికి బీఆర్ఏస్ తరపున మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలని, గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత...