త్వరలోనే హైడ్రోజన్ బాంబు.. రాహుల్ వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయాలు..!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓట్ల చోరీపై సంచలన సమాచారాన్ని త్వరలో బయటపెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. ఇది సాధారణ ఆరోపణ కాదని, "ఆటమ్ బాంబు కంటే హైడ్రోజన్ బాంబు శక్తివంతమైనదే" అన్న పోలికతో తన మాటలకు మరింత బలం చేకూర్చారు. ఆ వివరాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో...