హైదరాబాద్ లో విషాదం..విద్యుత్ స్తంభం విరిగిపడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దుర్మరణం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ బైక్ రైడర్ మరణించాడు. నాచారం కార్తికేయ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సాత్విక్ తన బైక్ పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. రహదారి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి ఆయనపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇలాంటి పాత దెబ్బతిన్న...