4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం : భట్టి విక్రమార్క

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమల తోడ్పాటు కీలకం.. *సిమెంటు, స్టీల్ కంపెనీలు భాగస్వాములు కావాలి.. *ధరల్లో తగ్గింపు చేసి, నాణ్యతతో సరఫరా చేయాలి కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావడానికి సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆయన, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల...