కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమనే సంకల్పంతో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయని, ఆ పరిస్థితిని గుర్తించిన కేసీఆర్ నిర్ణయం సమయోచితమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇల్లు, 60 లక్షల మంది సైనికుల సైన్యం అని, కేసీఆర్...