ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి
కాకతీయ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అవినీతి బహిర్గతమైంది. కర్ణమామిడి గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి వెంకటస్వామి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ బాధితుడు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో ఇల్లు కోసం గ్రామ కార్యదర్శి వద్ద దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఫైలు ముందుకు జరగాలంటే రూ. 20,000 లంచం ఇవ్వాలని వెంకటస్వామి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు చేసేది ఏమీ లేక ఏసీబీ...