అవయవ దానాలపై చైతన్యం రావాలి: లయన్స్ క్లబ్
కాకతీయ, మహబూబాబాద్ టౌన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం, భావి వైద్యుల పరీక్షల కోసం, పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అందజేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉండాలని మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న బుధవారం పిలుపునిచ్చారు. రక్తదాన పక్షోత్సవాలలో భాగంగా రక్త, నేత్ర, అవయవ, పార్థివ దేహాల దానంపై మానుకోటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమానికి వీరన్న అధ్యక్షత వహించి మాట్లాడుతూ. అలాగే కంటి చూపు సమస్యలు ఎక్కువగా...