గండి రామారం కుడి కాలువ ప్రారంభం..!!
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గండి రామారం (మల్లన్నగండి) రిజర్వాయర్ నుండి రూ.29 కోట్లతో నిర్మించిన కుడి కాలువను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగు నీటిని విడుదల చేశారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం వల్ల ఎడారి వలె ఉన్న జనగామ నేడు అధిక వరి ఉత్పత్తి చేసే జిల్లాగా మారిందని, అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఇప్పటివరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి 800...