ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలి..!!
కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండల ఆఫీస్ వద్ద బుధవారం రోజున ఎంసీపీఐయు ఆధ్వర్యంలో పేద ప్రజల ఇండ్ల కోసం ధర్నా చేశారు. అనంతరం ఎంసీపీఐ యు నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ శ్రీకాంత్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ యు నగర కార్యదర్శి మాలోత్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు, ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను ఖిలా...