జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ కు సంబంధించిన సన్నాహకాలు షురూ అయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 2,04,288 మంది, మహిళా ఓటర్లు 1,88,356 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ కు చెందినవారు 25 మంది ఉన్నారు....