బీఆర్ఎస్ సభ్యత్వానికి కవిత రాజీనామా..ధృవీకరించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేత కవిత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపినట్లు తెలిసింది. ఈ లేఖను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చినట్టు అధికార ప్రతినిధులు ధృవీకరించారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాల్లో కవితకు పెద్దగా పాత్ర లేకపోవడం, తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలు జరుపుకోవడం వంటి అంశాల మధ్య ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయ చర్చలు...