నాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత వెల్లడి..!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ లో కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగ్రుతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలులో ఐదున్నర నెలల ఉండి వచ్చిన...