మోడీ నిజంగా బీసీ అయితే బీసీ బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? జాజుల శ్రీనివాస్ గౌడ్

కాకతీయ, వరంగల్: హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వందల కోట్లు దోచుకుని బీసీలను మోసం చేసిన మాజీ పాలకులను తీవ్రంగా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాజకీయ పార్టీలు, అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని, సర్పంచ్ పదవుల నుండి కూడా బీసీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేశారని, బీసీలకు, బీసీ మహిళలకు...