నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున, నాగచైతన్య..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో మంగళవారం ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున, నాగచైతన్య హాజరయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరూ దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా వారు కోర్టుకు వెళ్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. మేం వేసిన పరువు నష్టం కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు మా వాంగ్మూలం ఇచ్చాం. నిజాన్ని న్యాయస్థానంలో స్పష్టం చేశాం. కేసు ఇంకా నడుస్తోంది కాబట్టి వివరాలు చెప్పడం ఇష్టంలేదు అని అన్నారు. కొండా...