మీ కుటుంబ పంచాయితీలోకి నన్ను లాగకండి: సీఎం రేవంత్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం హాట్ టాపిగ్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీశ్ రావు వెనక నిలబడ్డారని ఆరోపించడంతో వివాదం మొదలైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కవిత వెనక నేను ఉన్నానంటారు, హరీశ్ రావు వెనక ఉన్నానంటారు, మరికొందరు సంతోష్ రావు వెనక ఉన్నానంటారు. అసలు ఎవరి వెనకాలూ నేను లేను. నన్ను ప్రజలు...