సమ్మక్క, సారలమ్మ జాతరకు రూ.236 కోట్ల మాస్టర్ ప్లాన్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే వనదేవతల సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈసారి జాతరను గతం కంటే మరింత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం మేడారం మాస్టర్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఎండోమెంట్స్...