నానో యూరియా వాడి భూసారం కాపాడాలి: జిల్లా కలెక్టర్ సత్య శారద

కాకతీయ, గీసుగొండ: రైతులు ఉద్యాన పంటల్లో నానో యూరియా వాడి భూసారాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. బుధవారం గీసుగొండ మండలంలోని రైతు తిమ్మాపురం శ్రీకాంత్ వంకాయ తోటలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీగజాతి కూరగాయలైన సోరకాయ, బీరకాయ,దొండకాయ, దోసకాయ,పొట్లకాయ, బోడకాయ వంటి పంటల్లో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేయడం వల్ల...