‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణ..హైదరాబాద్‌లో జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణను ప్రపంచానికి ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రంగాలకు చెందిన గ్లోబల్ కంపెనీలకు ప్రాధాన్య గమ్యస్థానమైంది. ఇప్పుడు జాగర్ కూడా ఈ జాబితాలో చేరడం రాష్ట్ర బ్రాండ్ ను...