వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో : వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రైసిటీ పరిధిలో భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించబడనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 05 మధ్యాహ్నం 12 గంటల నుంచి సెప్టెంబర్ 07 ఉదయం 1 గంట వరకు కొనసాగనున్నాయి. ముఖ్యంగా భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాలని సూచించారు. ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, నర్సంపేట వైపుల...