వలసల పాలమూరును విద్య, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, మహబూబ్‌నగర్ : దశాబ్దాల కరవు, వలసలు, వెనుకబాటుతనం నుంచి బయటపడి పాలమూరును ఉన్నత స్థానంలో నిలబెట్టడం తన నైతిక ధర్మమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ఎస్‌జీడీ, కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఒకనాడు వలసలకు మారుపేరుగా ఉండేదని గుర్తుచేసిన సీఎం, విద్యే మన తలరాతను మార్చగలదన్నారు. అందుకే జిల్లాలో ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలు, బాసర తర్వాత రెండో...