కరీంనగర్ నుండి దేశానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వాలి: బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: గణేశ్ నిమజ్జన వేడుకలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుంచే విగ్రహాల నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం రోజున రెవిన్యూ, పోలీసు అధికారులతో మానకొండూరు చెరువును బండి సంజయ్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ..భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో హిందువులంతా ఐక్యంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలన్నారు. కరీంనగర్ నుండి సమాజానికి స్పూర్తిదాయక సందేశం వెళ్లాలి...