బతుకమ్మ కుంట పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
కాకతీయ, జనగామ : జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సూచించారు. గురువారం వారు సంబంధిత అధికారులతో కలిసి బతుకమ్మకుంట పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అందమైన రంగులతో ఏర్పాటు చేసిన గ్రిల్స్, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బెంచ్‌లను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాచ్ టవర్స్, ఐ లవ్ జనగామ బ్యూటీఫికేషన్ పనులు చూపరులను ఆకర్షించేలా ఉండాలని...