దారుణం..ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కాకతీయ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తండ్రి. తర్వాత తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మోక్షిత, వర్షిణి, శివధర్మ. భార్యతో కలహాల నేపథ్యంలో గతనెల 30వ తేదీన కుమార్తెలు, కుమారుడిని తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు. అక్కడి నుంచి అదే...