గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలి: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధుల విన‌తి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డిని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ఈ విష‌యాన్ని చేర్చార‌ని, దాన్ని ప్ర‌కారం గెస్ట్ లెక్చరర్ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. రెన్యూవల్ మరియు రెగ్యూలర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ అయిన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడానికి సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి పోస్టుల...