నానో యూరియాతో అధిక లాభాలు: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కాకతీయ, నర్సంపేట: నర్సంపేట మండలం గురజాల గ్రామంలో గురువారం డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేసే ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు వివిధ పంటలకు నానో యూరియా వాడకం వల్ల పంటలకు కావలసిన నత్రజని అందడంతో పాటు రైతులకు ఖర్చు, శ్రమ తగ్గుతుందని అన్నారు. రైతులు నానో యూరియా వినియోగించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. యూరియా...