పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే సహించేదిలేదు: చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే
కాకతీయ, పరకాల: మాజీ మంత్రి హరీశ్‌రావు, పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావు, పై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు. నాడు ఉద్యమంలో పాలనలో నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు...