గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలి: కరీంనగర్ పోలీసులు

కాక‌తీయ‌, కరీంనగర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా, సెప్టెంబర్ 05, 2025న కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలిసులు ప్ర‌క‌టించారు. ప్రజలు, వాహనదారులు ఈ మళ్లింపులకు సహకరించి ప్రయాణ సౌలభ్యాన్ని పాటించాల్సిందిగా కొరారు. హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ పల్లె బస్టాండ్ నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లవచ్చు. నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్లే వాహనాలు ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి...