సామాన్యులకు శుభవార్త..హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా లక్షలాది ఇన్సూరెన్స్ పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం వరకు పన్ను వసూలు అవుతూ ఉండేది. ఈ నిర్ణయంతో ఇకపై పాలసీదారులు ఆ పన్ను భారాన్ని భరించాల్సిన అవసరం లేదు. జీఎస్టీ రద్దుతో, ఒకవైపు సాధారణ కుటుంబాలకు నెలవారీ, వార్షిక ఖర్చుల్లో తగ్గుదల కనిపించనుంది....