హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి ప‌నుల‌పై అధికారుల‌తో సమావేశం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్: హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతం కోసం అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ స‌మావేశ మందిరంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తవ‌డంతో ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించడం వంటి పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఇప్పుడున్న రహదారిని వెడల్పు చేస్తుండ‌డంతో గ్రామాల గుండా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అడ్డంగా...