ఇందిరమ్మ ఇళ్లపై అధికారుల సమీక్ష..!!
కాకతీయ, గీసుగొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో గురువారం హైదారాబాద్ నుండి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో హౌసింగ్ అధికారులు, పీడీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీసుగొండ ఇన్చార్జి ఎంపిడిఓ పాక శ్రీనివాస్ మాట్లాడుతూ... లబ్ధిదారులు బిల్లుల కోసం ఇకపై ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇండ్లు యాప్ ద్వారా లబ్ధిదారులే ఫోటోలు నేరుగా అప్లోడ్ చేసుకోవచ్చని, వివరాలు యాప్‌లో...