గణేష్ శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు :వరంగల్ సీపీ
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో మొత్తం 2100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో నలుగురు డీసీలు, ఇద్దరు అదనపు డీసీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. ట్రై సిటీ పరిధిలోనే 1600 మందికి పైగా పోలీసులు విధులు...