తిరుమల నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు: హైకోర్టు కీలక ఆదేశాలు

కాకతీయ, టీటీడీ: అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో శ్రీవారి భక్తులను వన్యప్రాణుల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , అటవిశాఖ, టీటీడీసంయుక్త కమిటీ చేసిన సిఫార్సులు నవంబర్ లోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోకు హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమల దేవస్థానానికి చేరుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్లు, నడక మార్గాల్లో భక్తుల రద్దీ అధికమవుతుండటంతో భద్రతా...