హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కాళేశ్వరం కేసు కోసమేనా?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో అధికారులతో సమావేశం అయ్యారు. వ్యక్తిగత పనుల మీద ప్రవీణ్ సూద్ హైదరాబాద్ కు వచ్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కానీ కాళేశ్వరం విచారణను తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన ఐదు రోజుల్లోనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడం...