మెడికల్ కాలేజీలో కలకలం..మహిళల బాత్రూంల్లోకి చొరబడి దొంగతన యత్నం..?
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్ శివారులోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో శుక్రవారం ఉదయం చోరి ప్రయత్నం జరిగింది. మహిళల బాత్రూంలను టార్గెట్‌గా చేసుకొని దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. ఓ వ్యక్తి బుర్కా వేసుకొని మహిళతో పాటు బాత్రూంలోకి వెళ్లి, ఒక మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే బాధితురాలు ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న మహిళ బంధువులు ఆ వ్యక్తిని పట్టుకొని చెప్పులతో...