వినాయక నిమజ్జనం ప్రారంభించిన కార్పొరేటర్ ..!!

కాకతీయ, గీసుగొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కట్టమల్లన్న చెరువు వద్ద వినాయక నిమజ్జనాన్ని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిమజ్జ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు మున్సిపల్ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 16వ డివిజన్ పరిధిలోని జాన్‌పాకలో జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లోనూ కార్పొరేటర్ మనీషా శివకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ప్రేమ,...