అందరి సమన్వయంతోనే మంచి ఫలితాలు..!!
కాకతీయ, వరంగల్ బ్యూరో : నేరం చేస్తే శిక్ష తప్పదనే భయాన్ని నేరస్థుల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించి ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేనంతగా ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు వరకు వివిధ నేరాల్లో నిందితులకు కోర్టు శిక్షలు విధించడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 16 కేసుల్లో శిక్షలు...