సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్.. ఇంత రాద్ధాంతం అవసరమా?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందంటూ ఆరోపించారు. ఈ రోజు లండన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా..ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏడాదిన్నర...