గొర్రెల దొంగ అరెస్టు..!!

కాకతీయ, గీసుగొండ : గొర్రె పొట్టేళ్ల దొంగతనాలపై గీసుగొండ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఉంచి నిందితుడిని పట్టుకున్నారు. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజులుగా గీసుగొండ, ఆత్మకూరు, దుగ్గొండి, దామెర మండల పరిధిలో వరుసగా గొర్రె పొట్టేళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాల వెనుక కాజీపేటకు చెందిన బండ వరుణ్, వరంగల్ చెందిన అన్నెబోయిన గణేష్ అనే ఇద్దరు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలగా శుక్రవారం బండ వరుణ్ ఒక కారులో 10 గొర్రె పొట్టేళ్లను తరలిస్తుండగా ఊకల్ క్రాస్ వద్ద...