ఉపాధ్యాయుల చేతుల్లోనే సమాజ భవిష్యత్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాకతీయ, వరంగల్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా వరంగల్ లోని ఆకుతోట ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యతోపాటు విలువైన జ్ఞానాన్ని నేర్పించేది గురువులని అన్నారు. గురువుల సేవలు ఎన్నటికీ మరువలేమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని,...