మానవ బాంబుల పేరుతో బెదిరింపులు.. ముంబైలో హైఅలర్ట్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేగింది. నగరానికి మానవ బాంబులను పంపించామంటూ, భారీ పేలుళ్లతో ముంబైని కుదిపేస్తామని దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. లష్కర్ ఏ జిహాదీ అనే అకౌంట్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ఈ మెసేజ్ వచ్చింది. నగరంలో 34చోట్ల వాహనాల్లో మానవ బాంబులను ఉంచామని..ఏ క్షణంలోనైనా పేలుళ్లు జరగవచ్చని అందులో దుండగులు హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ముంబై మొత్తం హైఅలర్ట్ విధించారు. నగరంలో సోదాలు చేపట్టారు. నగరంలో భారీగా భద్రతా...