గణేష్ నిమజ్జనం కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు..!!

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. గణేష్ శోభాయాత్ర , నిమజ్జనం కోసం దాదాపు 867 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఏన్‌సీసీ క్యాడెట్‌లు, వాలంటీర్లను విధుల్లో నియమించినట్లు ఆయన తెలిపారు. బందోబస్తులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది ఎస్‌ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులు,...