స్నేహితుడిని కాపాడపోయి యువకుడు గల్లంతు ..వినాయక నిమజ్జనం వేళ అపశృతి

కాకతీయ,గీసుగొండ: కెనాల్ కాల్వలో పడిన స్నేహితుడిని కాపాడబోయి యువకుడు గల్లంతయిన ఘటన వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గీసుగొండ సిఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఎర్రం పూర్ణచందర్ (19) గ్రామంలోని మేకలబండ వినాయక మండపం వద్ద ఉండగా అతని స్నేహితులైన కాలే రాకేష్, నక్కినేని భరత్ లు పూర్ణచందర్ ను వారి టూ వీలర్ పై ఎక్కించుకొని గ్రామ శివారులోని కెనాల్ బ్రిడ్జి దగ్గరికి వెళ్లి మద్యం తాగిన అనంతరం కాలే...