సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్‎సూద్‎కు అస్వస్థత…జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన శ్రీశైలం దేవస్థానం దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వస్తుండగా గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రవీణ్ సూద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయ దర్శనం చేశారు. తిరుగు ప్రయాణంలో వాహనంలో ఉండగానే ఆయనకు అస్వస్థత అనిపించినట్లు తెలుస్తోంది. దగ్గరలోని వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స...